పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

89

యెంతోకాలమునాఁడు చేయఁబడి యుండవచ్చును. ఆకాలమందును నటుతరువాతను ననేకభాగములు కలుపబడియుండినటులఁ గనఁబడుచున్నది.

అన్ని పురాణములలోను భాగవతము, విష్ణుపురాణము, మహాభారతము, హరివంశము శ్రీకృష్ణులవారినిగురించి చెప్పఁబడియున్న ముఖ్యములైన గ్రంథములై యున్నవి. అందు భాగవతము సాధారణముగ విష్ణుచారిత్రమునుగురించి 12 స్కంధములుగఁ బుట్టియున్నది. అందు బదియవదాని యందు నీశ్రీకృష్ణులవారిచరిత్ర వ్రాయఁబడి యున్నది. అదియు శ్రీకృష్ణులవారిపిదప ననేకశత సంవత్సరములక్రిందట వ్రాయఁబడి యుండినందున నందులో మనుష్యస్వభావశక్తికి మించిన యనేకములైన యూహలతో జేరినకథలు గలవు.

మహాభారత మనునది పాండవులతో సంబంధించిన శ్రీకృష్ణులవారిచారిత్రమునే చెప్పుచున్న యదికాని వారినిమిత్తమయి పుట్టినది కాదు. తక్కిన రెండుగ్రంథములయందును శ్రీకృష్ణచారిత్రమె ప్రధానముగ వ్రాయఁబడియున్నది. గనుక భాగవతముకంటె నీమూడుగ్రంథములయందును మనము హెచ్చు ప్రామాణ్యబుద్ధి నుంచవలయును. ఈమూడింటిలో మహాభారతము పాండవులతో సంబంధించినప్పుడు మాత్రమె శ్రీకృష్ణులవారికథను జెప్పుచున్నది. కాన నిష్పక్షపాతతరమైన