పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

91

గనఁబరచిరి. మరియు బూతన యనుశబ్దము స్త్రీలింగము. ఆహేతువుచేత భాగవత, హరివంశకర్త లిది రాక్షసి యని, కంసునిదాది యని బహుశ: వ్యవహరించియుందురు. విష్ణుపురాణములో శిశుఘాతిని యని మాత్రము చెప్పఁబడియున్నది గాన నాగ్రంథకర్త లావ్యాధిని రాక్షసిగాను, దాదిగాను నేవిధముగ భ్రాంతి నొందిరో చూడుఁడు. తమభ్రాంతిని స్థాపించుటకుగా నసందర్భపుకథను పూతననుగురించి కల్పించిరి. ఈ పైయుదాహరణనుబట్టి శ్రీకృష్ణులవారినిగురించి వ్రాయఁబడినచరిత్ర లనేకసంవత్సరములపిదప వ్రాయఁబడిన వనునదియు, నాగ్రంథకర్త లొకవిధముగ జరిగినవానిని బొరపాటున మరియొకవిధముగ దీసికొనినదియు, వా రట్టివిరుద్ధా భిప్రాయములను స్థాపించుట కెట్టికథలను జేర్చినదియు మీకిప్పుడు విదితమే గదా!

(2) మరియు పైఁ జెప్పఁబడిన యన్నిగ్రంథములయందును శ్రీకృష్ణులవారు కాళియనామము గల నాగాధిపతియగు నొక గొప్పసర్పముతో యుద్ధముజేసి నాగస్త్రీల యొక్క ప్రార్థనపైని బ్రాణములతో నానాగాధిపతిని విడిచిపెట్టిరని చెప్పఁబడి యున్నది. నాగ యనుశబ్దము సర్పమునకు వర్తించును. అందునుండి యాగ్రంథకర్త లాకాళియునిసర్పము క్రింద భ్రమసి తీసికొనుచు నాస్త్రీలను వర్ణించుటలో వారు