ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఘంబులన్ ద్రుంపగాజూచి మాంసాది కానేక శల్యా పురీషాదులున్ గల్గు కూపంబులన్ ద్రోయ గా దేవతానీకమా బాధలన్ జిక్కి తా జేయునదే దియున్ గానకోదేవి యోశాంభవీ శాంకరీ క స్క దుర్గాంబయోకంచి కామాక్షియో కాళీ యో పార్వతీ శంభురాణీ భవానీ సురాపూజి తా దేవియంచున్ గడుందీనతన్ బొందినిన్నా ర్తులై వేడనౌతారమున్ బొందియున్ పెక్కు. లౌబాహులన్ ఖడ్గశూలాద్యనేకాయుధాల్ బ ట్టిఝాంకార మొప్పార క్రోధాగ్ని జ్వాలాప్ర కాశంబుచే వెల్గుచున్ వచ్చునీమోము నుంగాం చియాదానవానీక బృందంబుల్బబ్బ యీ రూప మేనాడు జూడంగ లేదంచు యోతల్లి యోమా త యోదేవిరక్షింపు రక్షింపుమంచున్ దగన్ వే డుచున్నట్టి యవ్వారినిన్ వీడి మహిషాసురున్ దృంచి దేవాదులన్ గాచి రక్షించవా భూమి