పుట:ShriiAmmavaariDandakam1922.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

శ్రీ అమ్మవారి దండకం.

శ్రీ మన్మహాదేవ దేవీ మహీమండలిన్ వాస మైయున్న యోదేవతా సార్వభౌమా మణీధీమణీ లోకసంచారణీ భక్తచింతామణి దుష్టశిక్షామణీ మంజుభాషామణీ పాపసంహారిణీ పుణ్యసంచారిణీ ముక్తికాంతామణీ పావనీనిన్నువర్ణింప బ్రహ్మాదిశేషుండును న్నోపగాలేని నేనెంతవాడన్ ధరన్ ముస్ను యాదానవానీక దుర్మార్గులన్ బాపగా పెక్కురూపంబులన్ పెక్కునామంబులన్ నుద్భవంబందవేతొల్లి యింద్రాది లోకంబులన్ జేరితాజేయు కల్లోలమున్‌ జూచి భీతాత్ములై యుండు పుణ్యాత్ములౌ దేవసం