పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

72

కొనరు. ఇట్టి వైద్యులు అధములు. ఇటులనే కొందరు మతగురువులు తమబోధలు మన్ననపొంది ఆచరింపబడుచున్నది లేనిది విచారించరు. రెండవరకపువైద్యులు రోగినిమందువేసికొనుమని చెప్పుటతోవిడువరు. రోగినిరాకరించినప్పుడువానితో వాదించి బుజ్జగింతురు. అదేవిధమున ప్రజలను సన్మార్గమున భగవద్భక్తిగలిగి సత్యాన్వేషణపరాయణతో వర్తింపజేయుటకు కొందరుగురువులు సకలకష్టములనుపడుదురు. వీరుకొంచెము పైతరగతిబోధకులు. మూడవతరగతి వైద్యులు, మహోత్తములుందురు. రోగి బుజ్జగింపులకు లొంగనియెడల బలవంతపెట్టుదురు. రోగిరొమ్మున మోకాలుపెట్టి అదిమిపట్టి గొంతులోమందువేసి మ్రింగింతురు కూడను. ఇట్లేకొందరుగురువులు, అవసరముకలిగెనేని; శిష్యులను నిర్బంధించి ధర్మపధమున నడపింతురు. వీరు పరమోత్తములు.

215. సుప్రసిద్ధోపన్యాసకుడు ఒకడు హరిసభయందొకనాడు ఉపన్యసింపదొడగెను. ఉపన్యాసమధ్యమున "భగవంతుడు బొత్తుగ రసహీనుడు. మనస్వాభావమునుండి కొంత మాధుర్యమును వానికి అప్పుగాయిచ్చెదముగాక." అనిచెప్పినాడు. రసము అనగా ప్రేమమొదలగు దివ్యలక్షణములని వానిభావము. వానిపలుకులు ఆలకించినప్పుడు నాకొకబాలుని విషయము జ్ఞప్తికివచ్చినది. అతడుతనమేనమామగారిగోశాలనిండ గుఱ్ఱములున్నవని చెప్పినాడు. గోశాలలు గుఱ్ఱాలకొఱకై కట్టునవికావని కొంచెము తెలివిగలవారికి తెలిసిన విషయమే. ఆపిల్లవానిమాటలు అబద్ధములనియు, వానికి