పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

71

8వ అధ్యాయము.

213. ఒకదినమున పంచవటిదాపుగా పోవుచుండ కప్పయొకటి భీకరముగా అఱచుచుంట వినవచ్చినది. దానిని పాము పట్టుకొనియుండునని ఊహించితిని. చాలాసేపటికి నేను తిరిగివచ్చునప్పుడును ఆకూతవినబడుచునేయుండెను. పొదలలో గుండ చూచితిని. ఒకబురదపాము కప్పను నోటితోపట్టుకొని యున్నది. దానిని అది మ్రింగనూలేదు; విడచివేయనూలేదు. పాపము ఆకప్పకు బాధనివృత్తికాదు. ఆకప్పవిషముగల నాగుబామునోట పడినయడల ఒకటిరెండు కూతలతో దాని పని ముగించియుండునుగదా యని తలంచితిని. కాని యిప్పుడు పాముయొక్క బాధయు కప్పయొక్క బాధయు సమానమే.

అటులనే జ్ఞానశూన్యుడు అహంకరించి యింకొకని తరింపజేయుటకు బాధ్యతపూనినయెడల యిద్దఱిదుఃఖములకును అంతముండదు. శిష్యుని అహంకారముగాని వానిసంసారబాధలుగాని తుదముట్టవు. అనర్హుని దఱిచేరిన శిష్యుడు ఎన్నడును తరింపజాలడు. కాని సమర్ధుడగు గురువు నాశ్రయించినజీవుని అహంకారము మూడుసార్లు బెకబెకలు పెట్టగానె తుదముట్టును.

214. వైద్యులలో మూడురకాలవారున్నటుల, గురువులలో కూడ మూడురకాలవారు కలరు. ఒకరకపువైద్యులు పిలువగానెవచ్చి రోగినిచూతురు; నాడి పరీక్షింతురు; మందు నిర్ణయించి పుచ్చుకొమ్మందురు. రోగి నిరాకరించెనా వాని గొడవ విడిచివెడలిపోవుదురు. ఇంక ఏలాటిజోక్యమును పెట్టు