పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59

7వ అధ్యాయము.

185. ఒకడు చెఱువులో గాలమువేసి చేపలుపట్టుచుండెను. అవధూతలవారు వానిదగ్గఱకుపోయి "అన్నా! కాశికి త్రోవయెద్ది?" అని యడిగిరి. నీటిపైని బెండు అప్పుడే చేప యొకటి ఎఱను పట్టబోవునట్లు సూచన తెలుపుచుండెను. కాబట్టి ఆమనుష్యుడు మారుపలుకక తదేకదృష్టిలో నుండి పోయెను. చేప గాలమునకు తగుల్కొనినపిమ్మట యతడు వెనుకకుతిరిగి "అయ్యా, మీరడుగుచుండినదియేమి?" అని విచారించినాడు. అవధూతలవారు వానికి నమస్కారముచేసి "అయ్యా మీరు నాకు గురువులు. నేను పరమాత్మధ్యానము చేయుచు కూర్చుండుసమయమున, నేనుమీపోల్కిని అనసరించి నాధ్యానము ముగియువఱకును, యితరమును లక్షించ కుండునటుల చేయుడు." అనివేడిరి.

186. కొంగఒకటి నెమ్మదిగా నీటికడకునడచుచు చేపను పట్టబోవుచుండెను. దానివెనుకనే బోయవాడు కొంగపైని గుఱిపెట్టి బాణమువేయజూచుచున్నాడు. కొంగకు ఆస్పృహయే లేదు. అవధూతులవారా కొంగకు మొక్కి "నేను ధ్యానమున కూర్చుండుసమయమున నీవలెవర్తించి నావెనుక యెవరుండిరో యేమిజరుగుచుండెనో అని తిరిగి చూడకుందును గాక." అని పలికిరి.

187. గ్రద్ద ఒకటి ముక్కున చేపనుకఱచుకొని యెగిరి పోవుచుండెను. అనేకములగు కాకులును, ఇంక గ్రద్దలును, గీపెట్టుచు దానివెంటబడి, ముక్కులతోపొడుచును, ఆచేపను లాగికొన ప్రయత్నించుచున్నవి. అది యేదిశకుపోయినను కాకు