పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

58

దువు. అటులనే బ్రహ్మమును చేరగోరుదువేని, బ్రహ్మవేది అగు ఒక్కగురుని బోధనే నమ్ముకొని పూర్ణముగ విధేయుడవై నడువవలయును.

183. గాఢమగు ధ్యానము, నిశ్చలవిశ్వాసము తీవ్రవేదనముకలిగి బ్రహ్మమును చేరబోవునతనికి గురువు అవసరము లేదు. కాని అటువంటి తీవ్రహృదయావేదన కల్గుట చాల అరిది. కావునగురువుయుండుట అవసరము. గురువు ఒక్కడుగనే యుండవలెను; ఉపగురువులు పెక్కండ్రు ఉండిన యుండవచ్చును. మనము ఎవనియొద్ద యేమినేర్చినను అతడు యుపగురువు అనబడును. అవధూతస్వాములవారికి యిరువది నల్గురు గురువులుండిరట.

184. అవధూతస్వాములవారొకసారి డోళ్ళు, సన్నాయి, బాకాలు మొదలగు వాద్యవిశేషములతో పెండ్లివారు ఒక డొంకత్రోవనుపోవుట గాంచిరి. ఆఉత్సవము పోవుచున్న డొంకకు చేరువనే పొంచియుండి యొకపక్షిపై గుఱిపెట్టుచు, ఆవాద్యఘోషను లక్ష్యపెట్టక, ఒకసారియైనను వారివైపు కన్నుత్రిప్పక తదేకదృష్టి నిలిపియున్న బోయవానిని చూచినారు. అవధూతలవారు వానిని సమీపించి చేతులు జోడించిమ్రొక్కి "అయ్యా, మీరు నాకు గురువులు, నేను ధ్యానములో కూర్చుండు సమయమున, మీమనస్సు ఆపిట్ట పైన ఏకాగ్రమైనవడువున, నామనస్సుధ్యేయమూర్తిపైని ఏకాగ్రమైనిలుచునట్లు చేయుడు" అనిరి.