పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

60

లును, గ్రద్దలును, వెంటాడుచునేయున్నవి. విసిగెత్తిపోవ, ఆగ్రద్ద తనముక్కునయున్నచేపను విడచివేసినది. వెంటనే యింకొకగ్రద్ద దానిని ముక్కునకఱచుకొనినది. తక్షణమే యాకాకులును, గ్రద్దలును అప్పుడు చేపనుకఱచుకొనిన గ్రద్దవైపుతిరిగి దానిని వెంటాడసాగినవి. మొదటిగ్రద్ద ఏబాధయు లేకుండ ఒక చెట్టుకొమ్మమీదచేరి శాంతముగ కూర్చున్నది. అదినిశ్చలముగను శాంతముగను కూర్చుండుటను కాంచి అవధూతలవారు దానికి నమస్కరించి "నీవు నాకు గురువు. 'ఓగృధ్రరాజమా! మానవుడు తానుపూనుకొను సంసారకాంక్షలభారమును ఎంతకాలమువిడువడో అంతకాలమును ఆతడు సంసారబాధలనుండి తప్పించుకొని నెమ్మదిని పొందజాలడని నాకు బోధించితివి సుమీ! అనిరి.

188. ఈశ్వరరహస్యములను తెలిసికొను తీవ్రవేదన నీకు కలిగినయడల, ఆయనయే నీకడకు సద్గురువును పంపగలడు. ఓభక్తవరా! గురువును వెదకికొనుటకై నీవుశ్రమపడుట అవసరముండదు.

189. శ్రీగంగానదిలో ముఱికినీళ్లను, పెంటలను, అన్నింటిని పడవేయుచున్నారు. కాని దాని పవిత్రత తగ్గిపోవుటలేదు. గురువు గంగాభవనీవంటివాడు. దూషణములు తిరస్కారములు వానిని అంటజాలవు.

190. గురునిందవాక్యములను నీవు వినబోకుము. అతడు నీజనకునికంటెను, జననికంటెను, ఉత్తముడు. నీయెదురుగా నీతల్లిని, నీతండ్రిని తిట్టినచో నీవు ఊరకుందువా? అవసర