పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

44

చిత్రములజూచుటకై చుట్టునుమూగరు; ఇతరులన్ననో నోరులుతెరచుకొని వానిచిత్రములను విడ్డూర్యముతో చూచుచుందురు కాదా!!

143. బూరుగప్రత్తిచెట్టు విత్తనాలు దానిక్రిందపడవు. అవి చాలాదూరము గాలిలోకొట్టుకొనిపోయి యెక్కడనో నాటుకొనును. అటులనే మహాత్మునిబోధలు వానిస్వస్థానమునగాక చాలాదూరమున ప్రకాశించును. దూరపువారు వానిని గౌరవింతురు.

144. అవతారపురుషునకు చిక్కుదోచు సమస్యలేదు. మహాదుర్జ్ఞేయమును క్లిష్టమునగు జీవితసమస్యలు సయితము ప్రపంచములోని సర్వసామాన్యవిషయములంత సులభముగ వానికి తోచును. తేట తెల్లముగనుండు అతనిబోధలు పసిపిల్లలకును సులభగ్రాహ్యములుగనుండును. యుగయుగాంతములనుండి పేరుకొనియున్న అజ్ఞానాంధకారమునైనను తృటిలో పాఱద్రోలు దివ్యతేజముతో ప్రపూర్ణుడైన సూర్యుడే అతఁడు.

145. చంద్రార్కజ్యోతియననగు విచిత్రమిక్రకాంతి ఒక్కొకప్పుడు ప్రత్యక్షమగును. భక్తిచిహ్నములు, జ్ఞానచిహ్నములు, ఉభయములును ప్రస్ఫుటముగగల చైతన్యదేవునివంటి అవతారములు అట్టివి. ఒకేసారిగా సూర్యుడు, చంద్రుడును ఏకమై ఆకసమున చూపట్టినట్టులుండును. ప్రకృతిలోయిట్టి సంఘటము అత్యంతము అపూర్వమగునటులభక్తిజ్ఞానములు