పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43

4వ అధ్యాయము.

అతఁడు వేలకొలదిప్రజలను మాయాసముద్రమును తాను దాటించి మోక్షాశయమున సులభముగజేర్చగల్గును.

139. సముద్రముపొంగినప్పుడు ఆనీరు నదులను ప్రవాహములను పూరించి దాపునగలప్రదేశములనెల్ల జలమయముచేసివైచును; వాననీరో మామూలుకాలువలంబడి మాత్రము ప్రవహించును. అవతారమువచ్చునప్పుడు వానికృపకు పాత్రులైనవారెల్లరును ముక్తినిపొందుదురు. సిద్ధులు ఎంతయోకష్టపడి తపములు, జపములుజేయువారికి మాత్రమే త్రోవజూపి రక్షింపగల్గుదురు.

140. పెద్దమ్రానొకటి ప్రవాహమున బోవునప్పుడు అది ఎన్నివందలపక్షులనో తనపైమోసికొనిపోగల్గును. అది మునుగదు. రెల్లుపుల్లయో ఒక్కకాకియెక్కినచాలును, మునిగిపోవును. అటులనే అవతారపురుషుడువచ్చినప్పుడు వానిని ఆశ్రయించి అనేకులు ముక్తికాంచగలరు. సిద్ధపురుషుని ఆశ్రయించి కొలదిమందిమాత్రమే ఎంతెంతయోకష్టపడినమీదట తరింతురు.

141. రైలుయింజనుతానువేగముగబోయిగమ్యస్థానమును చేరుటేగాక సరకుబండ్లనెన్నింటినో తనతోడలాగికొని పోగల్గుచున్నది. అటువంటి ఇంజనునుబోలువారు అవతారపురుషులు. పాపభారముచే క్రుంగియున్న అనేకులను తోడ్కొనిపోయి భగవత్సాన్నిధ్యమునచేర్చగల్గుదురు;

142. మహాత్ములు తమవారిచేత మన్ననలను పడయజాలకుండుటకు కారణమేమిటి? గారడీవానిబందుగులు వాని