పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

42

అట్టిమహాభారమును వహించువారే జగదుద్ధారకులగు మహానుభావులు.

136. అవతారమనగా నరరూపముదాల్చివచ్చిన భగవంతునిసందేశహరుడు! మహాచక్రవర్తియొక్క రాజప్రతినిధివంటివాడు. దూరమున ఏరాష్ట్రమునందైనను అల్లరులు జరుగునెడల చక్రవర్తి తనప్రతినిధిని పంపును. అధేవిధమున, ప్రపంచమున ఏభాగమునందైనను ధర్మహానిజరుగునెడల అధర్మమును ఉద్ధరించి పెంపొందజేయుటకై తనఅవతారమును భగవంతుడుపంపును.

137. కుప్పలుగపడియున్న మన్నును, చెత్తను, తొలగించి, యుగములకొలదిగవాడుకలేక పూడికపడియున్న ప్రాతనూతినిబయలుపఱుచు పురాణవస్తుశోధకునితో సిద్ధపురుషుని పోల్పదగును. అవతారమో పూర్వమెన్నడును నీరుదొఱకి యుండనితావున క్రొత్తగా బావినిత్రవ్వునుమహాశిల్పివంటివాడు; సిద్ధపురుషుడు మోక్షజలమునకు దాపుననున్న వారికి మాత్రమే మోక్షమునొసగజాలును; అవతారమో ఎవని హృదయము బొత్తుగ భక్తిజలమన్నమాటలేక యెడారివలె ఎండబారియున్నదో అటువంటివానికిని మోక్షజలమును ప్రసాదింపగలడు.

138. పెద్దపొగయోడ నీటిపైని కడువేగముతోపోవుచు చిన్నచిన్న నావలను, పడవలను, అనేకమును తనతోడతీసుకొని పోగలదు. ఆతీరుననే అవతారపురుషుడు వచ్చునప్పుడు