పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45

4వ అధ్యాయము.

రెండునుగూడి ఒక్కపురుషునందు మూర్తీభవించుటమిగుల నరుదు.

146. సీతారాములు, రాధాకృష్ణులు అనువారి కథలు కేవలము నీతిని బోధించుటకై కల్పనచేసిన కధలనియు, వారుచారిత్రకపురుషులుకారనియు, అంతరార్ధగూఢార్ధములను నేర్పుటకే పురాణేతిహాసములు యేర్పడినవనియు తలంపకుడు. మీరును నేనునుయెట్లో అట్లేవారును నరశరీరధారులే. వారుదివ్యాంశసంభూతులుగాన చారిత్రకముగను, నైతికముగనుగూడ వారిచరిత్రలు ఉపకరింపగలవు. మహాసాగరమున అలలెటువంటివో, బ్రహ్మమునఅవతారములటువంటివేసుడీ!

147. ఉత్సవాదులలో కాల్చుచిచ్చుబుడ్లలో పూలచిచ్చుబుడ్డియనునది యుండును. దానికినిప్పుఅంటించినప్పుడు కొంతవఱకు ఒకవిధమైన పువ్వులను, మఱికొంతవఱకు యింకొక తీరుపువ్వులను, ఆపిమ్మట వేరొకరకపుపువ్వులను యెగురచిమ్మును. దానిగర్భమున అనంతభేదములుగల పూలరాసులున్నవాయనునట్లు తోచును. అట్లేఅవతారములుండును. మఱియు యింకనొకరీతి చిచ్చుబుడ్డికలదు. అదికాల్చినప్పుడు కొంచెముకాలి తుస్సుననెగిరిపోవును. ఈతీరునసామాన్యజీవులుచిరకాలము జపతప ధ్యానసాధనలసలిపి సమాధిని ప్రవేశించిమరలిరారు.

148. అవతారములతోగూడి జననముగాంచువారు నిత్య ముక్త జీవులైగాని, లేకతుదిజన్మను పొందినవారుగగాని యుందురు.