పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

390

శిష్యుని యింటిలో గందఱగోళము, ఏడుపులు పెడబొబ్బలు వినవచ్చెను? ఇరుగు పొరుగువారెల్ల వచ్చి ఆశిష్యుడు ఒక గదిలో కదలక మెదలక విచిత్రరీతిని కూర్చుండియుండ గాంచిరి. అందఱును ప్రాణముపోయెనని తలంచిరి. ఆతని భార్య "అయ్యో! నాధా, నీవెక్కడికిపోతివి? నన్నెందుకు విడనాడిపోతివి? ఇట్టి ఆపదవచ్చునని ఎన్నడును కలలో నైన తెలియమైతిమి!" అని విలపింప సాగెను. ఇంతలో బంధుగులు వచ్చి పాడెనుగట్టి శవమును దహనమునకై తీసికొనపోవ సిద్ధపడిరి. అప్పుడు కొంత అలజడి జరిగినది. ఆకళేబరము వంకరలుతిరిగియుండెగాన ద్వారములోనుండి రాదయ్యె. అదిచూచి పొరుగు పెద్దమనుష్యుడొకడు గడ్డపలుగును దెచ్చి ద్వారబంధమును త్రవ్వివేయ సమకట్టెను. అంత వఱకును పొక్కిపొక్కి యేడ్చుచున్న భార్య పలుగుచప్పుడు వినబడగానె అక్కడికి పరుగిడిపోయి ఏడ్చుచు వారేమిచేయ నుండిరని అడిగెను. అచ్చటివారిలో నొకడు ఆమెభర్తను ద్వారములోగుండ తీసుకొనిపో వీలులేనందున ద్వారమును ఊడగొట్టుచుంటిమని చెప్పెను. ఆభార్య యిట్లనెను:- "వద్దు, వద్దు. అలాచేయవద్దు. నేను వితంతువునైతిని; దిక్కులేనిదానను. దిక్కులేనిబిడ్డలను పోషించుకొనవలసినదాననైతిని. మీరు ద్వారమును పడగొట్టివేసినచో తిరిగి బాగుచేయుటపడదు. నాభర్తకు వాటిలినది ఏమొవాటిలినది - వాని కాలుచేతులను నఱికి బయటికితీసికొనిపొండు." తాను సేవించినమూలిక ప్రభావము తగ్గిపోవుటచేత అప్పుడే స్మృతితెలిసిన హఠయోగి, భార్యపలుకులువిని "ఏమేమే! నాకాలు