పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

391

41వ అధ్యాయము.

సేతులు నఱుకుడనుచుంటివా?" అని లేచి బొబ్బలు పెట్టెను. తత్క్షణమే యిల్లువిడిచి గురువుతోగూడి వెడలిపోయెను.

997. ఒకపేద ఉద్యోగముదొఱకక భాదలుపడుచుండెను. అనేకపర్యాయములు రాజుకడకుపోయి పడగాపులుపడి యుండి ఏదేని సేవలోనుంచుకొనుడని వేడుకొనెను. ఆరాజు నిరంతరము ఈదినముకాదు రేపురమ్మనుచునేకాలముగడుపుచుండెను. చాలదినములు జరిగిపోయినవి. ఒకదినమున అతడు తన బాధలగురించి యొకస్నేహితునితో చెప్పుకొనెను. ఆస్నేహితుడు వెంటనే "నీవెంత తెలివిలేనివాడవు! ఆరాజు కడకు పోయిపోయి నీకాళ్ళఱిగిపోయియుండును. గంగాబాయికడకు పోయి దానికాళ్లమీద పడుము. నీకు రేపే ఉద్యోగముదొఱకును" అని ఉపాయము చెప్పెను. గంగాబాయి రాజుయొక్క ఉంపుడుకత్తె. పాపమాపేదవాడు గంగాబాయికడకేగి, "తల్లీ! నేనుకడుదుర్దశ ననుభవించుచున్నాను. నీవుతప్ప నన్ను రక్షించువారులేరు. నేను బ్రాహ్మణుడను; నాకితరమగు ఆధారములేదు. జననీ! చాలకాలమునుండి ఉద్యోగము చిక్కక దుఃఖించుచున్నాను. ఆలుబిడ్డలు అన్నమో రామచంద్రాయనిఅడలుచున్నారు. నీవొక్కమాట చెప్పితివా నాకుద్యోగము లభించగలదు" అని బ్రతిమాలుకొనెను. గంగాబాయి "సరేగాని, ఎవరితోచెప్పిన నీకు ఉద్యోగము రాగలదు?" అని అడిగినది. ఆబ్రాహ్మణుని దైన్యముచూచి ఆమె అయ్యో పాపము! ఈబ్రాహ్మణుడు కడు దరిద్రుడుగ నున్నాడు!" అనియు అనుకొనెను. ఆబ్రాహ్మణుడు వెంటనే "నీవురాజుగారితో ఒక్కమాటమాత్రము