పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

389

41వ అధ్యాయము.

లను సంపాదించితిరని విన్నాను" అనెను. సాధువు వానిని సగౌరవముగ స్వాగతమిచ్చి కూర్చుండజేసెను. అప్పుడే ఒక ఏనుగు ఆవైపుగా పోవుచున్నది. "అదిగో! ఏనుగు వచ్చుచున్నది. మీరు ఇచ్ఛామాత్రమున దానిని చంపగలరా? అని సన్యాసి సాధువునడిగెను. "ఆహా! చేయవచ్చును" అని సాధువు పలికెను. ఇట్లనుచు చేతిలో కొంత మట్టినిదీసి మంత్రించి ఏనుగుశరీరముపైని చల్లినాడు. ఆయేనుగు గిలగిల తన్నుకొనుచు పడిచచ్చినది. దానిని చూచి సన్యాసి ఓహో! మీశక్తి అత్యద్భుతమైనది! ఎంతసులభముగా ఏనుగును చంపితిరి!" అని పొగడెను. సాధువు సంతృప్తుడై మందహాసముచేసినాడు. సన్యాసి మరల "ఈఏనుగును తిరిగి బ్రతికింపగలరా?" అనెను. "ఆహా! "అదియు చేయనగును" అనుచుకొంతమట్టిని మంత్రించి ఏనుగు కళేబరముమీదచల్లగా అది బ్రతికి లేచినది. అంతట సన్యాసి యిట్లుపలికెను:- "బహు విచిత్రమహిమ! కాని నేను మిమ్మొక్క ప్రశ్ననడుగదలచినాను. ఇప్పుడే మీరొకఏనుగును చంపి, తిరిగి బ్రతికించ గల్గితిరి. కాని దానివలన మీ కేమిలాభము వచ్చినది? మీరేమైన అభివృద్ధి గాంచితిరా? అందువలన భగవంతుని పొందగల్గితిరా?

ఇట్లనుచు సన్యాసి అదృశ్యమయ్యెను!

996. ఒకశిష్యుడు గురువుతో తనభార్య తనను మిక్కిలిగ ప్రేమించినదిగాన, సన్యసించజాలనని చెప్పెను. ఆతడు హఠయోగాభ్యాసము సాగించినాడు. గురువు కొంతరహస్యమును వానికి బోధించినాడు. ఆకస్మికముగా ఒకదినమున