పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

380

ముఖ్యావసరము; కాని పూర్ణవిశ్వాసమున్నయెడల స్వల్పపుసాధనయే చాలును.

వ్యాసులవారు నదిని దాటబోవుచుండిరి. అప్పుడే గోపికలును వచ్చిరి. వారును ఏఱుదాటగోరి యున్నారు; కాని రేవున పడవలేదు. చేయదగునదేమని వారు వ్యాసులవారి నడిగిరి. అందుకాయన "దిగులుపడకండి నేను మిమ్మును ఏఱుదాటించెదను. కాని నాకు ఆకలివేయుచున్నది. తినుటకు ఏమైనపెట్టెదరా?" అనెను. గోపికలకడ పాలు వెన్న మీగడ యుండగా వానికి పెట్టిరి. ఆయన భుజించినాడు. అంతట గోపికలు "నదిని దాటించుటేమైనది?" అని వేగిరించిరి. వ్యాసులవారు నీటియొడ్డున నిలువబడి "ఓయమునా! ఈదినమున నేనేమియుతినియుండనియెడల, ఆ మహత్తువలన నీరుపాయలై మేము పొడినేలమీదుగ దాటిపోవునటుల త్రోవనిత్తువుగాక!" అని పలికెను. ఆయన నోటనుండి యీపలుకురాగానే నీరు రెండుపాయలై నడుమగా పొడినేల కాన్పించెను. గోపికలు అద్భుతపడిరి. "ఇప్పుడే మనము పెట్టినవన్నియుతిని, నేనేమియు నేడుతిననియెడల, అని యీయన పలుకుటేమివింత!" అని తలంచుచుండిరి. వ్యాసులవారు తానుగాదేనిని తినలేదనియు, తనలోనిస్వామియే నిజముగా ఆరగించియున్నాడనియు స్థిరభావమును కలిగియున్నందుకు అది నిదర్శనమని ఆగోపికలు గ్రహించరైరి.

985. ప్రతాపచంద్రముజుందారుగారితో శ్రీపరమహంసులవారిట్లనిరి:- "మీరువిద్యావంతులు, బుద్ధిశాలురు;