పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

379

41వ అధ్యాయము.

983. తీవ్రకాంక్ష భగవత్సాక్షాత్కారమునకు త్రోవ. పసివాండ్రకుండునట్టి నిష్కాపట్యముండవలయును; తల్లిని చూచుటకై వారికి కలుగునంతటి తీవ్రకాంక్ష యుండవలయును.

జటిలుడను పిల్లవాడుకలడు. అతడు బడికిపోవునప్పుడు అడవిగుండ ఒంటరిగా పోవలసి యుండెను. అతడు తఱుచుగా భయపడుచుండెడివాడు. ఈమాట అతడు తల్లితోచెప్పగా తల్లి "బిడ్డా! భయపడనేల? నీకు భీతికలిగినప్పుడెల్ల కృష్ణుని పిలువుము" అని చెప్పెను. "కృష్ణుడెవరమ్మా?" అని బాలుడు అడిగినాడు "కృష్ణుడు. నీఅన్న" అని తల్లిచెప్పినది. ఆపిమ్మట జటిలునకు అడవిలో భయముతోచినప్పుడెల్ల "అన్నా! కృష్ణా!" అని అరచెడివాడు. ఎవరును రాకపోవుట చేత ఇంకనుబిగ్గఱగా "అన్నా! ఓకృష్ణా! ఎక్కడనున్నావు? నాకు భయముకలుగుచున్నది. రారమ్ము! నన్ను రక్షింపుము." అని మొఱలిడేవాడు. పరమవిశ్వాసియగు ఈ బాలుని మొఱవిని కృష్ణుడు రాకయుండగలడా? కృష్ణుడొక చిన్న బాలునిరూపు తాల్చివచ్చి "సోదరా! వచ్చితిని. నీకు భయమెందుకు. నాతోడరమ్ము! నేను నిన్ను బడికితీసికొని పోయెదను" అనెడువాడు. ఆబాలుని బడికడ విడిచి "నీవు పిలిచినప్పుడెల్ల నేనువచ్చెదను. భయపడకుము." అని కృష్ణుడు చెప్పెడివాడు.

సత్యమగు భక్తివిశ్వాసముల మహిమయట్టిది!

984. ఆత్మజ్ఞానము పొందుటకు పారమార్ధిక సాధనలు