పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

381

41వ అధ్యాయము.

జిజ్ఞాసాపరులు. కేశవచంద్రసేనులును మీరును గౌరాంగనిత్యానందులబోలు సోదరులు. మీరు ప్రపంచమును చాలినంత చూచినారు - కావలసినన్ని ఉపన్యాసాలు, వివాదములు, శాఖాసమాజాలు ఎన్నో చూచినారు. మీకింకను వానియెడ లక్ష్యమున్నదా? అటునిటు చెదఱు మీమానసములను ఏకాగ్రముచేసి భగవంతునివైపునకు మరలించు సమయము దాటిపోవుచున్నది. పరమాత్మ సాగరమున నిమగ్నులు కండు."

మజుందారుగారు:- "అవును, స్వామీ! నేను అటుల చేయవలసినదే ఆ విషయములో సందేహము లేదు. కాని ఇదంతయు నేను చేయుట కేశవుని పేరు ప్రఖ్యాతులను నిలువబెట్టుటకే!"

పరమహంసులవారు:- (నవ్వుచు) "నేనొక కథచెప్పెద వినుడు. ఒకడు కొండనెత్తిని గుడిసెవేసినాడు. చాల కష్టపడినాడు; డబ్బును హెచ్చుగ కర్చుచేసినాడు. కొద్ది దినములకే గాలివానవచ్చి ఆకొంపను ఉఱ్ఱూతలూగింపసాగినది. దాని నెటులైన సంరక్షించనెంచి "ఓదేవా! ఈగుడిసెను నాశము చేయకుము!" అని వాయుదేవుని ప్రార్థించినాడు. ఆతడు పెక్కుసారులు ప్రార్థించినను గుడిసె ఊగులాడుచునే యున్నది. అప్పుడు అతడు వేఱొక ఉపాయమును ఆలోచించినాడు. హనుమంతుడు వాయుదేవుని కుమారుడని పురాణములు చెప్పుమాట వానికి జ్ఞప్తికివచ్చినది. వెంటనే "ఓదేవా! ఈగుడిసెను కాపాడుము. ఇదినీతనయుడగు హనుమంతునిది!"