పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

367

41వ అధ్యాయము.

నెగ్గించుకొనగల్గినాడు. ఏటినీరుజలజలసందడిచేయుచు తనపొలములోనికి ప్రవహించుటచూడ వానిఆనందమునకు మేర లేకుండెను. అనంతరము అతడు ఇంటికిపోయిస్నానముచేయుటకై చమురుతెమ్మనెను. స్నానమును, భోజనమును ముగించిన పిమ్మట సుఖముగా గుఱ్ఱువెట్టి నిదురించినాడు. ఇటువంటి స్థిరసంకల్పము తీవ్రసద్వైరాగ్యమునకు నిదర్శనము.

ఇంకొక వ్యవసాయకుడును అదేపనిలోనుండెను. వాని భార్యవచ్చి యింటికి రమ్మనగనే, పార భుజమునబెట్టుకొని మారాడక వెడలిపోయినాడు. ఆతడు సకాలమున పొలమునకు నీరుపెట్టుకొనలేకపోయినాడు. ఇతని వర్తనము సోమరితనమునకును, మందవైరాగ్యమునకును నిదర్శనము. తీవ్రయత్నములేక పొలమునకు నీరుపెట్టజాలని విధమున తీవ్రసంకల్పము నిష్ఠ లేనిది బ్రహ్మసాక్షాత్కారమును బడయుటయు సాధ్యముకాదు.

973. ఒకప్పుడు సాధువొకడు తన శిష్యునికి ఆత్మజ్ఞానము నేర్పు నుద్దేశ్యముతో ఒకతోటలోనుంచి వెడలిపోయెను. కొన్నిదినములకు గురువువచ్చి వానికేమైన కొఱతయుండెనా? యని విచారించెను. శిష్యుడు ఔననగా, వానికి తోడుగ నుండుటకై "శ్యామ" అను ఒకసుందరిని పంపి, మత్స్య మాంసములను స్వేచ్ఛగా తినుచుండుమని చెప్పెను. చాల కాలమునకు పిమ్మట గురువు తిరిగివచ్చి వెనుకటిరీతినే విచారణచేసెను. ఈసారి శిష్యుడు "లేవు, నా కేమియు కొఱతలు లేవు" అనెను. అంతట గురువు వారిరువురను పిలిచి