పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

366

తరువాత బ్రహ్మనిష్ఠనుపూనెదను" అని పలుకబోడు. అతడు తీవ్రమగు మనోనిశ్చయము గలిగి యుండును.

ఒకానొకదేశములో అనావృష్టిబాధ సంభవించినది. వ్యవసాయకులందఱును కాలువలుత్రవ్వి పొలములకు నీరు బెట్టుట కై తీవ్రప్రయత్నములచేయుచుండిరి. వారిలోనొకడు గట్టిపట్టుదలగలవాడు, ఏటితో తనకాలువను కలుపువరకు ఆగకుండ త్రవ్వుటకునిశ్చయించెను. వానికిస్నానమువేళయైనది. వానిభార్య కొమార్తెచేతికిచ్చి నూనెను పంపినది. కూతురు వచ్చినాయనా! "మిట్టమధ్యాగ్నమైనది. ఇదిగోచమురు, స్నానముచేయరమ్ము" అనెను. "ఉండుము; నాకింకినుపనితీరలేదు" అని తండ్రిచెప్పినాడు. మూడవజామును దాటినది; ఇంకను అతడు స్నానముచేయరాడు; తిండిమాట తలపెట్టడు! తుదకు వానిభార్య వచ్చి "నీవింకను స్నానము చేయవైతివేమి? అన్నము చల్లారిపోయినది. కూర రుచితప్పిపోవును. నీకెప్పుడును అతిఛాందసమే! ఇక నైననురమ్ము! తక్కినపని రేపో లేకున్న భోజనమైనపిమ్మటనో చేసికొనవచ్చును" అనిచెప్పసాగినది. ఆసేద్యగాడు మహారౌద్రరూపుడై, శాపనార్థములు పెట్టుచు, చేతినున్న పలుగుతో చావమోదువానివలె పెండ్లామును తఱుముచు ఇట్లనెను:- "ఓసీ! బుద్ధిహీనురాలా! చేనుఎండిపోవుచున్నది. కండ్లుకనబడుటలేదా? నేను ఈదినమున చేనుకునీళ్లు పెట్టవలెను; ఆపిమ్మటనే ఏసంగతైనను!" వాని ఆగ్రహమునుగాంచి ఆస్త్రీ పర్విడిపోయినది. భగీరధ ప్రయత్నముచేసి, ఎట్టకేలకు, అర్ధరాత్రివేళ, అతడు తనపంతమును