పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

368

శ్యామచేతులనుచూపి "ఇవియేమిటో చెప్పగలవా?" అని శిష్యుని అడిగెను.

శిష్యుడు - "ఏల అట్లడిగెదరు? అవి శ్యామ చేతులు!'

గురువు - "ఇదేమిటి?"

శిష్యుడు - "శ్యామముక్కు!"

గురువు - "ఇవేమిటి?"

శిష్యుడు - "శ్యామకండ్లు!"

ఇట్లే గురువుప్రశ్నించుచు నుండెను.

ఇంతలో "నేను ప్రతిదానినిగూర్చియు శ్యామకు చెందినదిగా చెప్పుచున్నాడనే! ఇక శ్యామఎవరు?" అనుశంక శిష్యునిమనస్సునకు తట్టినది. అంతట రిచ్చపాటుచెంది "ఈ కండ్లు చెవులు మున్నగునవి యెవరివో ఆఈశ్యామయెవరు?" అని శిష్యుడు గురువును అడిగినాడు. గురువు "ఈశ్యామ యెవరో నీవు తెలియకోరుదువేని నాతోడరమ్ము. నీకు బోధచేసెదను" అనిచెప్పు తీసికొనిపోయి ఆ రహస్యము నుపదేశించెను.

974. మండోదరి తనభర్తయగు రావణునితో "నీకు సీత కావలసియున్నచో, నీకుగల మాయాశక్తులవలన సీతా పతియగు రామునిరూపమునుదాల్చి ఆమెభ్రమపెట్టవచ్చునే?" అనెను.

"ఛీ ఛీ! మూఢురాలా! నేను రాముని పవిత్రరూపమును దాల్చినయెడల నాకింక యింద్రియ భోగవాంఛలు మనసుననిలుచునా? ఆరూపుస్ఫురణకురాగానే నాహృదయము