పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

356

నను ఆగక, సన్యాసి చెప్పినటుల ఇంకను లోతట్టునకు పోయి వెండి గనిని కనుగొనెను. తేగలిగినంత వెండినితెచ్చి అమ్ముకొని యింకను సొమ్ము సంపాదించినాడు. ఇట్లే దినదినమును అడవిలోపలికి చొచ్చుకొనిపోవుచు బంగారపు గనులను, వజ్రపుగనులను, కనుగొనుచు మహాశ్రీమంతుడాయెను. బ్రహ్మజ్ఞానమును సంపాదించకోరు నతడీ తీరుననే చేయవలయును. ఏకొలదిపాటి సిద్ధులనో మహిమలనో సంపాదించగనే ఆగిపోక సాధనను సాగించినయెడల పరమాత్మ జ్ఞానమహ దైశ్వర్యమును పడయగల్గును.

965. మంగలియొకడు భూతముఆవేశించిన చెట్టుక్రిందుగా పోవుచు "బాంగారుతో నిండిన ఏడు కడవలు నీకు కావలయునా?" అను ధ్వనినివినెను. ఆమంగలి యిటునటునుచూచి యెవరిని కాంచలేదు. కాని, ఏడు బంగారపు కడవలు కావలెనా అనుశబ్దము వానిలోలోభమునుపుట్టించగా; ఆతడు బిగ్గఱగా "ఔను. ఆఏడుకుండలను నేనుతీసికొనెదను" అని అఱచినాడు. "పొమ్ము! ఇంటికిపొమ్ము! నేనాకుండలను నీయింటికిచేర్చినాను" అను ధ్వని వినవచ్చినది! ఈ వింతపలుకులు సత్యములా అని తెలిసికొను ఆతురపాటుతో రివ్వు రివ్వున యింటికి పర్విడినాడు. ఇంటిలో అడుగిడగానే ఎదుట బంగారముతోనిండిన ఏడుకుండలు కండ్ల బడినవి! ఆతడు వానిని పరీక్షించిచూడగా ఒక్కదానిలోమాత్రము సగమువఱకు బంగారమున్నది; తక్కినవానిలో నిండుగా బంగారమున్నది. ఆమంగలిమనస్సున ఇప్పుడొక తీవ్రసంకల్పముపుట్టినది.