పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

357

41వ అధ్యాయము.

ఆఏడవకుండను బంగారుతో నింపవలెను; అప్పుడు వాని ఆనందము సంపూర్ణము కాగలదు అని వానికి తోచినది. ఆతడు తనయొద్దనున్న బంగారు నగలను వెండినగలను అన్నిటిని అమ్మి వరహాలుగమార్చి ఆకడవలో వేసినాడు. కాని ఆవిచిత్రపుకడవ ఎప్పటివలెనే పూర్తికాకయేయుండెను. అందువలన మంగలికి మిగుల ఆరాటముకలిగి, తానును తన కుటుంబమును తిండికిలేక మాడుచును, సంపాదించిన ఆర్జన నంతటిని బంగారుగ మార్చి, దానిలో పడవేయసాగెను. కాని ఆకుండ ఎప్పటియట్లేయుండెను. ఒకనాడు తనసంపాదన కుటుంబపోషణకు చాలకున్నదనిచెప్పి తనజీతమును పెంపు చేయుడని రాజును అతడు వేడుకొనినాడు. ఈమంగలి మీద రాజునకు అభిమానముండుటచేత వాని జీతమును తక్షణమే రెట్టింపుగావించ యుత్తర్వులచేసినాడు. ఆమంగలి తన రెట్టింపు జీతమును పైసంపాదన ద్రవ్యమును అంతయు ఆకుండలోవేయుచుండెను. కాని ఆకడవనిండు సూచనలేవియు కానరాలేదు. తుదకామంగలి తిరిపెమెత్తసాగి, తన ఉద్యోగముచేవచ్చు జీతమును, ఇతరసంపాదనమును, తిరిపెపుడబ్బును, సర్వమును ఆవింతకడవలోనె వేయసాగెను. నెలలు గడచుచున్నవి. ఆలోభియొక్క దుఃఖము పెంపొందుచుండెనే గాని తగ్గుటలేదు. రాజు వాని దీనదశనుకనిపట్టి ఒకనాడు "ఓరీ! నీజీతము సగముగానున్న దినములలోనే నీవు సంతోషముతోడను, ఆనందముతోడను, వికాసముతోడను చూపట్టెడి వాడవు. నీ జీతమును రెట్టింపుచేసినపిమ్మట నీవు శోకాక్రాంతుడవై దిగులు నిరాశ పొంది చిక్కినట్లున్నావు. నీకేమి