పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

334

పెట్టెను తీసికొనిపోవుటకుగూడ అవకాశమీయక తఱుమగొట్టించినాడు. దుర్గర్వమునకు ఫలమిటులుండును!

946. ఒకగుడిచెంతగా సన్యాసి యుండేవాడు. ఎదురుగా ఒకబోగముదాని యిల్లుండేది. అనేకులు నిరంతరము దాని యింటికి వచ్చిపోవుటగాంచి, ఒకనాడు సన్యాసి దానిని పిలిచి "దివారాత్రములు నీవిటుల విటులతో నీచసల్లాపముల కాలము పుచ్చుచున్నావే! నీకు రానున్నముందుగతి ఎంతఘోరముగానుండునో ఎఱుంగుదువా? అని చీవాట్లుపెట్టినాడు. పాపము, ఆసాని మిగుల విచారపడి అంతరంగమున పశ్చాత్తాపముతో తన పాపముల క్షమింపుమని దైవమును ప్రార్థించసాగినది. అయినను వ్యభిచారము దానికి వంశాచారమైయుండుటచేత, మరేవృత్తిని సులభముగాఅవలంభించి జీవించుతెన్నుగానక, తన తనువు వ్యభిచరించినప్పుడెల్ల మరిమరి పశ్చాత్తాపము పొందుచు దైవమును ప్రార్థించుచుండేది. ఆసన్యాసి తానుచేసిన హితబోధ వ్యర్థమైనదిగదా యని విసిగికొనుచు, ఆసాని జీవితమున ఎందరువిటగాండ్రు దానియింటికి బోవుదురో లెక్కవేయ సంకల్పించినాడు. ఆదినమునుండి ఆసానియింటిలోనికి పురుషుడు ప్రవేశించినప్పుడెల్ల ఒక బెడ్డనుతీసి యొకచోటున వేయసాగినాడు. రానురాను ఆబెడ్డలు పెద్దకుప్పగా పేరినవి. ఒకనాడాయన సానికి ఆకుప్పనుచూపి, "ఓవనితా! ఈకుప్పను చూచితివా? నీపాపపు హీనకార్యమును మానుమని నేను నిన్ను మందలించినపిమ్మట నీవెన్నిసార్లు వ్యభిచరించితివో అన్నిసార్లకు అన్నిరాళ్లుపేర్చగాయింత