పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

335

41వ అధ్యాయము.

కుప్ప ఏర్పడినది! ఇంకనైనను నీదుర్వృత్తిని మానుమని చెప్పుచున్నాను" అని గద్దించిచెప్పెను. పాపము, ఆదీనురాలు తన పాపభారమునుగూర్చి భీతిచెంది, తన అశక్తతను గూర్చి దుఃఖించి "భగవంతుడా! నా యీ ఘోరజీవనము నుండి నన్నురక్షింపవా?" అని అంతరంగమున మొఱలిడ సాగినది. ఆప్రార్థనను భగవంతుడు వినినాడు; ఆనాడే యమదూతలు ఆసాని యింటిమీదుగా పోయినారు. ఆమె యీ ప్రపంచమును విడిచి చనినది. ఈశ్వరేచ్ఛవలన ఆనాడే సన్యాసియు దేహ త్యాగముచేసినాడు. యమదూతలు సన్యాసియొక్క జీవునిపట్టుకొని అధోలోకములకు గొనిపోయిరి; విష్ణుదూతలు వచ్చి సానిజీవుని వైకుంఠమునకు దీసికొనిపోయిరి. ఆసాని అదృష్టమునుగాంచి సన్యాసి గొంతెత్తి యిట్లనెను. "భగవంతుని సూక్ష్మధర్మనిర్ణయమిటులుండునా? నేను నాజీవితమును జపతపనిష్ఠలతో సర్వత్యాగముచేసి గడపితిని? నన్ను నరకమున కీడ్చుకొనిపోవుచున్నారు! నిరంతర కళంకజీవనమును గడపిన వ్యభిచారిణిని వైకుంఠమునకు గొనిపోవుటయా?"

ఈపలుకులువినిన విష్ణుదూతలిటుల తెలిపిరి:- "భగవంతుని నిర్ణయములు సదా న్యాయముగనే యుండును; నీ వెటుల సంకల్పింతువో అట్టిఫలితముల ననుభవింతువు. పేరు ప్రఖ్యాతులకై యత్నించి బాహ్యాడంబరముతోడను గర్వముతోడను జీవనము గడపితివి; భగవంతుడు నీకు దానినే లభింపజేసినాడు. నీహృదయము భగవంతునికొఱకై తపించి