పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

333

41వ అధ్యాయము.

తుదకొక బుద్ధిశాలియగు వైద్యుడు నిజమును కనుగొనెను. అంతట ఆవైద్యుడు వానిని చాటునకు దీసికొనిపోయి "అయ్యో! నీవిటులచేయుట క్షేమమా? పిచ్చియెత్తినటుల నటించుటచేత నీవు నిజముగాపిచ్చివాడవె కాగలవు సుమీ! ఇప్పటికే నీయందు కొన్నిఉన్మాదచిహ్నములునాకు కాన్పించుచున్నవి!" అని మందలించినాడు. ఈపలుకులు వానిహృదయమున గాఢముగ నాటినవి; వానిదోషము వానికి గోచరించినది. అంతట పిచ్చివానినటనను యతడు విడిచివేసినాడు. నీవు నిరంతరముగా ఎటువంటివాడవైనటుల నటింతువో అటువంటివాడవే యగుదువు.

945. ఒకానొక ధనికునిప్రధానసేవకుడు వాని ఆస్తినంతను పరిపాలన చేయుచుండెను. ఈఆస్తి ఎవరిదని అడిగినయెడల "అయ్యా, యీసంపదయంతయునాదే; ఈయిండ్లు, ఈతోటలు అన్నియు నావే" అనేవాడు. ఇట్లుపలుకుచు చాల గర్వాతిశయముతో త్రిప్పుకొనుచు నడిచేవాడు. అతని యజమానుడు ఎవరును చేపలపట్టవలదని కఠినశాసనముచేసియున్న చెఱువులో ఈసేవకు డొకనాడు ఒక్క చేపనుపట్టుట తటస్థించినది. వాని దురదృష్టమువలన అప్పుడే వానియజమానుడు యచ్చోటికి వచ్చి ఆమోసగాడు చేయుచున్న పనిని స్వయముగా చూడనయ్యెను. అంతట యజమాని కినిసి తక్షణమే వానిని దూరముగ వెడలగొట్ట నాజ్ఞయిడుటయేగాక, మిగుల అవమానించి పలువురు చూచుచుండగా చీవాట్లు పెట్టినాడు. పాపము ఆసేవకుని స్వంతసొత్తగు కొన్నిగిన్నెలు గుడ్డలుగల ప్రాత