పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

331

41వ అధ్యాయము.

942. వైశాఖమాసమున ఒక చిన్నమేకపిల్ల తల్లికడ నాటలాడుచు, చంగు చంగున ఎగురుచుండెను. అచ్చట నది రోజూ పూలనుచూచి తల్లితో తానాపూవులను కొన్నిటిని తిని విందారగింతునని చెప్పెను. అందుకు తల్లి యిట్లనెను:- "బిడ్డా! ఆపూలను నీవందుకొనుట అంత సులభకార్యము కాదు. ఆపూలు నీకుచిక్కులోపల నీవు అనేకములగు తిప్పలు పడవలసియుండును. రాబోవు నవరాత్రి పండుగదినములు నీకంతగా శుభదినములుకావు. ఎవరేని నిన్ను కొనిపోయి దుర్గాదేవికి బలియీయవచ్చును; అదితప్పిన కాళికి నిన్నర్పింపవచ్చును. అదృష్టవశమున ఆగండమును తప్పినను జగద్ధత్రికి నిన్నారగింపు చేయుదురేమొ. అప్పుడు మనజాతిలో మగవాని నన్నిటిని జాతరలో నఱికివేయుదురు. మహదదృష్టము నీపాలబడి నీవిన్ని గండములను గడచి, సురక్షితముగ బ్రతికి పెద్దదానవైనయెడల దీపావళినాటికి రోజాపూల విందు తిందువుగానిలెమ్ము! అప్పుడు మంచి రోజాపూలు దొఱకగలవుకూడను."

ఈకథలోని మేకపలికినటుల మన కోర్కెలను తీర్చుకొనుటలో అత్యుత్సాహము కూడదు. మన జీవనసరణిలో తటస్థించు అనేక క్లిష్టపరిస్థితులను జ్ఞప్తినుంచుకొని యౌవనపు గొంతెమ్మ కోరికలను ఆపుకొనదగును.

943. ఒకమనుష్యుడు ఒకసాధువును అత్యంత వినయముతో సమీపించి "స్వామీ! నేను కడు దీనుడను; సాధుసత్తమా! నేనెట్లు తరింతునో తెలుపవేడెదను" అనెను. సాధువు వాని హృదయమునగల భావమును గ్రహించి