పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

332

"మంచిది; నీవుపోయి నీకంటె క్షుద్రతరమైనదానిని దేనినైన తీసికొనిరమ్ము" అనెను. అంతట ఆమనుష్యుడు వెడలిపోయి, అచ్చటచ్చటచూచి, తనకన్న హీనతరముగనుండుదానినికనుగొనలేక పోయెను. తుదకు తన పురీషమునుగాంచి "ఓహో! ఇదిగో, నాకన్న నీచతరమైనది ఉన్నది" అనుకొని దానిని సాధువుచెంతకు దీసికొనిపోవుటకై చేతితోపట్టుకొనబోయెను. అప్పుడాపురీషమునుండి ఒక ధ్వనియిట్లు వినవచ్చెను:- "ఓపాపీ! నన్నుతాకబోకుము. నేనొక మధురమును రుచ్చమునైన పూపమనై దేవతార్పణమునకు తగియుంటిని; చూచువారెల్లఱు నానందించియుండిరి. నాదురదృష్టదేవత నన్ను నీకడకుదెచ్చినది; నీసంసర్గము నన్నీహీనదశకుతెచ్చినది. నరులు నన్ను చూచిఅసహ్యించు కొనుచు ముక్కులను గుడ్డలుపెట్టి గట్టిగమూసికొని పారిపోవుచున్నారే! నేను నీసంసర్గకు వచ్చినది ఒక్కసారియే; అయ్యో నకర్మమిట్లయినది! నన్ను నీవు మరల నొకసారి తాకితివేని నాకింకను ఎటువంటి హీనతరదశరాబోవునో గదా!

ఆమనుజుడు ఈరీతిగా నమ్రతనేర్పబడి, అత్యంతము వినయశీలుడయ్యెను. తుదను ఉత్తమ పరిపూర్ణత్వమును బడసెననుట తధ్యము.

944. ఒకడు చాలఋణములనుచేసి, ఋణదాతలబాధలను తప్పించుకొను నిమిత్తము పిచ్చియెత్తినట్లు నటించసాగెను. వైద్యులు వాని రోగనివారణ చేయజాలరైరి. వానికి ఔషధములను యిచ్చినకొలదిని వానిపిచ్చి హెచ్చగుచుండెను.