పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

330

కాలక్షేపముచేయుదము." అని రెండవయతడు అనెను. మొదటివాడు దీని కొడంబడలేదు. అతడు భాగవతము చదువుచోటికి పోయి, వినుటకై అటకూర్చుండెను. రెండవవాడు వేశ్యవాటికకుపోయెను గాని, తానాశించిన ఆనందమును అనుభవించలేకపోయెను. కావున ఆతడిటుల తలపోయసాగెను:- "అకటా! నేనిక్కడికి ఏలవచ్చితిని? నామిత్రుడు శ్రీహరిలీలలను పావనకథలను వినుచు ఎంత సంతోషముతో నుండెనో కదా!" ఇటుల అపవిత్రస్థలముననుండి అతడు హరిని ధ్యానముచేసినాడు. రెండవవాడో భాగవతకథను వినుచును సంతసములేకయుండెను. అటకూర్చుండి తననుతాను నిందించుకొనుచు "ఏమీ, ఎంతబుద్ధిహీనుడనైతిని? నామిత్రునితోడ బోగముసానియింటికి పోనైతినే! అతడక్కడ ఎంతవిలాసముగా కాలము గడుపుచుండునో గదా?" అని గొణుగుకొనసాగెను. ఆతడు భాగవతమును చదువుతావున కూర్చుండెనను పేరేగాని, అక్కడనున్నంతసేపును వానిమనస్సు బోగముసానియింట తాను అనుభవించియుండగల వేడుకలపైననే యుండెను. ఇట్లు అతనిహృదయము నీచసంకల్పములతో మలినమైయుండుటవలన, అతడు స్వయముగా బోగమువాండ్ర యింటికి పోకపోయినను పాపమునే పొందినాడు. భోగవాటికకుపోయిన రెండవవాడు తాను అపవిత్రస్థలముననున్నను, హృదయము శ్రీహరి కథాకాలక్షేపముమీదనే యుండుటవలన భాగవత శ్రవణముచేసిన పుణ్యమును పడసెను.