పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

328

అంతనాబ్రాహ్మణుడు ఇంటికిబోయి ఆలాగుననే చేసెను. వైద్యులెందఱో రావింపబడిరి; కాని ఎవరును ఏమియు చేయజాలరైరి. రోగితల్లి వెక్కి వెక్కి యేడ్చుచున్నది: వాని ఆలు బిడ్డలు రోదనము చేయుచున్నారు. ఆతరుణమున సన్యాసివచ్చినాడు. "ఈవ్యాధి దుర్నివార్యమైనది. ఎవరైనను ఈరోగిప్రాణమునకు బదులుగా తనప్రాణమును అర్పించువారున్న తప్ప ఏమాత్రమును ఆశలేదు." అన్నాడు. ఈపలుకులు విని ఎల్లరును తెల్లబోయి నిలుచుండిరి. ఆసన్యాసి రోగియొక్క ముసలితల్లినిచూచి, "మీఅందఱిని పోషించు ఈ కుమారుడుమరణించినవెనుక వృద్ధాప్యమున నీవుండుటబ్రతికియు చచ్చినట్లేయుండును. వాని జీవములు మారుగా నీప్రాణము నిత్తువేని వానిని రక్షింక్షగలను. వాని తల్లివైయుండియు వానికొఱకు నీవీపాటిత్యాగమును చేయనియెడల లోకములో నింకెవరుదిక్కు వానికి?" అని పలికినాడు.

ఆవృద్ధస్త్రీ దగ్గుచు తడబడుచు యిట్లనెను: "స్వామీ, స్వామీ! నాబిడ్డడికొఱకు మీరు నన్నేమిచేయుమనిసెలవిచ్చినను చేయుటకునేని సంసిద్ధమే! నాప్రాణమా? వానిబ్రతుకుతోపోల్చిన నాదెంతపాటిది? కాని - అయ్యో - నేను చచ్చిపోయినతర్వాత - ఈపసికూనలందరు - ఏమైపోదురో అనుతలపుచేత - పిఱికితనము తోచుచున్నది! నాపాసమెంతటిదో! ఈపసివాండ్రను విడువలేను."

సన్యాసియు తన అత్తయు నిటుల ప్రసగించుచుండవినిన, రోగిభార్య, తన తల్లిదండ్రులజూచి రోదనముచేయుచు