పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

329

41వ అధ్యాయము.

"ప్రియజనకులారా! మీరేమగుదురో అనుచింతవలన నేనిట్టి త్యాగమునకు పూనజాలకుంటిని! కటకటా!" అని ప్రలాపింపసాగెను. అమెవైపుతిరిగి సన్యాసి తన ప్రాణనాథుని క్షేమముకొఱకు వానితల్లి త్యాగముచేయ జంకియున్నస్థితిలో తానైనసాహసించునేమొ యని విచారించెను. అంత నామె "అయ్యో! నేనెంతటిపాపిష్ఠిదాననో! నానొదుటవైధవ్యము వ్రాయబడెగాబోలును! నాకొఱకై శోకసాగరమున మునుగు తల్లిని తండ్రిని విడిచివేసి, నేనేమిచేయగలను?" అనినది. ఈరీతిగా ప్రతివారును తప్పించుకొనిరి. తుదకు సన్యాసి రోగితోనిట్లనెను.

"ఇకనిటుల చూడుము! ఒక్కరుమాత్రమేని నీకొఱకై ప్రాణమర్పించువారు లేరైరి. ఈలోకములో నెవరిని నమ్ముకొనదగదని నే ననినమాటలు ఇప్పటికైనభోధపడెనా?" ఇదంతయు కనిపెట్టుచున్న బ్రాహ్మణుడు తన బూటకపు సంసారమును త్యజించి ఆసన్యాసి ననుసరించి వెడలినాడు!

941. ఒకమానవుని పారమార్థికఫలము వానిమనస్సు యొక్క స్థితిని, జీవితాదర్శనమును, అనుసరించియుండును. అది వాని హృదయముపై నాధారపడును గాని బాహ్యకర్మలపై నాధారపడియుండదు. ఇద్దఱు స్నేహితులు భాగవతపురాణ కాలక్షేపము జరుగు తావునకు ప్రక్కగా పోవుచుండిరి. "అదుగో అక్కడికిపోయి కొంతసేపు పురాణమును వినుదుము." అని ఒకడనినాడు. "వద్దు మిత్రమా! భాగవతమువినినందున ఫలమేమున్నది. ఆవేశ్యవాటికకుపోయి వినోదముగ