పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

327

41వ అధ్యాయము.

యుని బోలియున్నాను. నేను ప్రతిస్త్రీని నాజగజ్జననిగ భావనచేతును."

940. బ్రాహ్మణుడొకడు ఒకసన్యాసిని కలిసికొని చాలసేపు మతవిషయములగురించియు లౌకిక వ్యవహారముల గురించియు, ప్రసంగించినాడు. తుదకు ఆసన్యాసి వానితో "బిడ్డా! చూడుము, ప్రపంచములో ఎవరిపైనను ఆశపెట్టుకొనుటతగదు. నీవునీవారుగానెంచుకొనునెవరును నీవారుకారు సుమీ!" అనెను. బ్రాహ్మణునకు నమ్మకము కుదరలేదు. తానురేయింబవళ్లు ఎవరికొఱకైపడరానిపాట్లు పడుచున్నాడో, అటువంటి తనకుటుంబమువారు అవసరముపట్ల తనకు సాయపడబోరనుటను అతడెటుల నమ్మగల్గును? కావున నిట్లనెను:- "అయ్యా! నాకు ఇసుమంత తలనొచ్చెనా, నాభాదతొలంగు నిమిత్తము తనప్రాణమును సయితము ధారవోయునంత ప్రేమతో నాతల్లి నన్నుచూచునే! అటువంటి నాప్రియజననిని నేను నమ్ముకొనలేకున్నచో, ఇంకెవరిపై నేనాధారపడగలనో ఊహింపజాల!"

సన్యాసి యిటులపలికెను:- "అటులనా! అయితే ఆమె నీకు ప్రాపైయుండునదే కావచ్చును! కాని నీవు చాలపొఱబడుచున్నావు, నిజము. నీతల్లిగాని, పెండ్లాముగాని కొడుకుగాని నీకొఱకై తమప్రాణముల నర్పింతురని ఎన్నడునునమ్మబోకుము. కావలసినచో నామాటలను రుజువుచూడవచ్చును. ఇంటికిపోయి కడుపులోశూలచేత మితిలేనిబాధపడుచున్నటుల నటించుచు పడికొట్టుకొను చుండుము. నేనువచ్చినీకొక చిత్రమును చూపెదను."