పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

326

మారి అత్యానందముతో ఆవుపేడను భక్షించి, తిరిగి మానవరూపునుధరించి నిలిచినాడు. రాజంతట సిగ్గుదెచ్చికొని రాణితో పిచ్చిప్రసంగములు చేయమానినాడు.

939. "మీరేల మీసతితోగూడి గృహస్థధర్మమును నడపరైరి?" అని ప్రశ్నింపగా శ్రీపరమహంసుల వారిటుల జవాబు చెప్పిరి:-

"కార్తికేయుడు ఒకదినమున పిల్లిని గిల్లినాడట. ఇంటిలోనికి పోయినప్పుడు తనతల్లిచెంప గీచుకొనిపోయియుంట కాన్పించినది. దానినిచూచి ఆకుమారస్వామి "అమ్మా! నీబుగ్గమీద ఈగాయమెటుల కలిగినది?" అని అడుగగా, "ఇది నీపనియే; నీగోటిగీతయే యిది" అని ఆజగజ్జనని ప్రత్యుత్తరమిడినది. కార్తికేయుడు వెఱగుపడి "అదెట్లమ్మా! నేను నిన్ను రక్కిన జ్ఞప్తిలేదే!" అనెను. "బిడ్డా! ఈయుదయమున నీవు పిల్లిని గిల్లినమాట మఱచిపోతివా?" అని తల్లి అడిగినది. "అవునమ్మా, నేను పిల్లిని గిల్లితిని. అయిన నీబుగ్గమీద గాయముపడుటెట్లు తల్లీ?" అని పలికినాడు. "ముద్దులబిడ్డా! ఈజగమున నాకు వినా ఏమియులేదు. సృష్టియంతయు నేనే! నీవెవరిని హింసించినను నాకే హింస కలుగును." అని తల్లిచెప్పినది. ఈపలుకులాలకించి కుమారస్వామి అత్యాశ్చర్యముచెంది, తాను వివాహమాడరాదని నిశ్చయించుకొనినాడట! అతడెవరిని భార్యగా గ్రహించగలడు? అటుల స్త్రీజనమునందెల్ల మాతృభావమును గఱచిన కుమారస్వామి పెండ్లియాడుటకు జంకినాడు. నేను కార్తికే