పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41వ అధ్యాయము.

నీతికథలు.

938. ఈవిశ్వమంతయు బ్రహ్మమయమేయని ప్రకటించు అద్వైత సిద్ధాంతమును ఒకరాజునకు వాని గురువు బోధించినాడు. అందువలన రాజునకు పరమానందము కల్గినది అతడు తన రాణినిసమీపించి "రాణికిని రాణిదాసీజనమునకును భేదములేదు. కావున రాణిదాసియె నాకు రాణిగ నుండవచ్చును" అనెను. రాణి తన భర్తమాటలకు నివ్వెఱపోయినది. ఆమె గురువుగారికి వర్తమానమంపి "అయ్యా! మీబోధల మహాదుష్ఫలమును చూడుదు" అని దీనముగ మొఱలిడినది. గురువు రాణిని ఓదార్చి, "నేడు రాజు భోజనముచేయుసమయమున అన్నముతో పాటు ఆవుపేడనుకూడ పళ్లెరమునందు పెట్టించుము" అని సలహా చెప్పినాడు. భోజనసమయమున గురువును రాజునుకలసి భోజనమునకు కూర్చుండిరి. అన్నముతోపాటు వడ్డించబడినఆవుపేడను చూడగనే రాజునకువచ్చినఆగ్రహము వర్ణింపనలవికాదు. దీనిని కనిపట్టిన గురువు "ఆర్యా, నీవు అద్వైతజ్ఞానము కలవాడవు. ఈఅన్నమునకును పేడకును భేదమేలపాటింతవు?" అని ప్రశ్నించినాడు. రాజంతట పట్టరానిక్రోధముతో "అద్వైతినని గర్వోక్తులుపలుకు మీరీపేడను తినండి" అని అఱచెను. గురువంతట "మంచిది!" అని తానొక సూకరము (పంది)గ