పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

321

40వ అధ్యాయము.

మాత్రము ఐహిక వ్యాపారములకు వినియోగమగును. భక్తుడు సదా దైవకార్యము లందెక్కువ ఉత్సాహియై యుండును. పాము తోకత్రొక్కినయెడల మహాకోపముచెందును, ఒడలంతటికంటె పామునకు తోకయందు స్పర్శజ్ఞానమెక్కువ.

923. పరమహంసదశ పంచాబ్దములబాలుని దశను పోలియుండును. వానికి స్త్రీ పురుష భేదము తెలియదు. అయిననుకూడ లోకమునకు ఆదర్శము జూపునిమిత్తము పరమహంసయు స్త్రీలవిషయమున జాగరూకుడై మెలగవలయును.

924. నిష్కాపట్యము సులభముగా భగవంతునికడచేర్చును. రాళ్లులేక చక్కగదున్ని మెత్తగాచేయబడిన నేలయందు విత్తనము సులభముగా మొలకనెత్తి పెరిగి ఫలమునిచ్చుతీరున, అమాయకునియందు వేదాంతబోధలు సులభముగా ఫలప్రదములగును.

925. ప్రాపంచిక వ్యావృత్తులు గలవారి భక్తిసాధనాఫలితము తాత్కాలికము. (ఆసంస్కారములు చాల కాలము నిలువవు.) కాని నిరంతరము భగవద్భక్తిసలుపువారు ప్రతిశ్వాసముతోడనుఈశ్వర నామోచ్చారణచేయుదురు. కొందఱు తమలోతాము "ఓం రామ ఓం" అని నిరంతరము స్మరణ చేయుచుందురు. జ్ఞానయోగావలంబులు "సోహం" అని పఠింపుచుందురు. కొందఱి జిహ్వ ఏదో మంత్రమునో స్తోత్రమునో ఉచ్చరించుచు, కదలుచునేయుండును.

926. జప తపములు సదా ఆచరించుచుండవలయును.