పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

320

వచ్చినప్పుడు బ్రాహ్మణి (శ్రీపరమహంసులవారికి తాంత్రిక సాధనలునేర్పిన యామె) నన్నుతీసికొనిపోయి స్నానము చేయించెడిది. కాని ఆమె నాచర్మమును తాకలేకుండెడిది. ఆమె నాశరీరమునంతను దట్టముగగుడ్డలతోచుట్టి ఆగుడ్డలమీద చేతులువేసి పట్టుకొనెడిది. నాశరీరమునకు పులిమిన బురదమన్ను వేడెక్కెడిది! ఆస్థితివచ్చినప్పుడు పెద్దయీటెను నా వెన్నెముకగుండ గ్రుచ్చుచున్నట్లు బాధకలిగెడిది. చచ్చిపోవువానివలె బొబ్బలుపెట్టితిని. కాని ఆబాధకు పిమ్మట అత్యంత దివ్యానందము కలిగెడిది.

918. పండ్రెండువత్సరములు వీర్యమును సంరక్షించుకొనినవానికి గొప్ప మహిమలు అలవడును. నూతన నాడి యొకటి సృష్టియగును. దానిని "మేధనాడి" అందురు. ఆనాడి బలపడినప్పుడు నరుడు సర్వమును జ్ఞప్తినుంచుకొనగలడు; సర్వమును ఎఱుంగ గలడు.

919. వీర్యనష్టమువలన శక్తి క్షీణించును. అనేచ్ఛితముగ సంభవించు శుక్లనష్టమువలన అంతగా అపాయములేదు. కాని సిద్ధులుసహా స్త్రీల గలియదగదు.

920. సంపూర్ణ బ్రహ్మచర్యము నవలంబింపక ఆధ్యాత్మిక రహస్యముల గ్రహింప నలవికాదు.

921. స్త్రీభోగమును విడిచినవాడు ప్రపంచమును త్యజించినవాడే! భగవంతుడు వానికి కడుదాపున నుండును.

922. సత్యమగు సాధువుయొక్కమనస్సు ముప్పాతిక భాగము భగవదర్పితమైయుండును; ఒక్క పాతికభాగము