పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

20

కలవెల్ల నారాయణస్వరూపమే, ఒక్క నారాయణుడే అనేకవేషములతో లీలలు సలుపుచుండును. సమస్తపదార్థములును వానిభిన్నభిన్నస్వరూపములే, వాని దివ్యమహిమను ప్రకటించునవియే.

66. భగవంతుడు ఈస్థూలశరీరమున ఎట్లువసించును? చిమ్మురు గొట్టములోని (Syringe) పుడకవలె అతడీ శరీరమున నుండును కాని అతడీశరీరమునకు అంటుకొనియుండడు.

67. ఒక్కెడ భగవానుడిట్లు వచించినాడు:- దండలోని పూవులు నాకక్కఱలేదు; ఆపూవులుగ్రుచ్చినదారము నాకు కావలెను. ఈజగత్తులో వస్తుజాలమేదియు నాకక్కఱలేదు; ఈవిశ్వమునంతను బంతిగకూర్చి పట్టినదారమన దగు ఆసూత్రాత్మ నాకుచిక్కినచాలును.

68. వానిపేరు చిన్మయుడు, వానినివాసముచిత్తు, ఆతడుప్రభువు విశ్వజ్ఞమూర్తి.

69. గురూపదేశములచేత ప్రబోధముగాంచినవాడై శ్రీరామచంద్రుడు ప్రపంచమును త్యజింపనెంచెను. తండ్రియగు దశరధమహారాజు వశిష్టునిబంపి వానికి సద్బోధకావింపుడనెను. శ్రీరామునివైరాగ్యము ఆవేశించియున్నదని వశిష్టుడు గ్రహించి "ఓరామా! ముందు నాతోడవాదింపుము; ఆపిమ్మట ప్రపంచమును త్యాగముచేయుము. ప్రపంచము బ్రహ్మమునకు భిన్నముగ వేఱైయున్నదా? చెప్పుము, అటులైనచో నీవు దానిని నిశ్శంకముగా విడిచివేయవచ్చును" అనిపలికెను. శ్రీరామచంద్రుడంతట