పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

2వ అధ్యాయము.

ఆవాక్కులఅర్ధమునుగూర్చితలపోసినవాడై, ఒక్కబ్రహ్మమే జీవుడుగాను జగత్తుగాను, ప్రత్యక్షమగుచుండెనని గ్రహించినాడు. ఆబ్రహ్మమునందేగదా సర్వమునకునుఉనికి! కావున శ్రీరాముడు మిన్నకుండవలసివచ్చెను.

70. సరియైన వివేకము రెండుతెరగులనుండును:- మొదటిది పృధక్కరణరూపము. రెండవది సమీకరణరూపము. మొదటిది మనసు దృశ్యజగమునుండి బ్రహ్మముకడకు నడపును. రెండవదానిని అనుసరించితిమా, అఖండ పరబ్రహ్మమే విశ్వముగా గోచరించుటను తెలియుదుము.

71. దేవుడే దొంగవానినిపోయి దొంగతనము చేయుమని ప్రేరేపించును, మఱియు ఆదొంగను పట్టుకొనుమని గృహస్థుని హెచ్చరించునదియు ఆతడే. ఆతడే సర్వమునకును కర్త! (ఏరూపముదాల్చు శక్తికైనను మూలము ఈశ్వర చైతన్యమే)

72. సాధకుడు తనభక్తిసాధనయందొకదశలో భగవంతుని సాకారునిగ భావనచేసి సంతసించును! మఱియు వేఱొక దశయందు వానిని నిరాకారునిగజూచి తృప్తుడగును.

73. కొన్నిసమయములందు నేనువస్త్రముల ధరించియుండి, మఱికొన్నివేళలందు దిగంబరుడనుగా నుండుతీరున బ్రహ్మము ఒక్కొక్కప్పుడు సగుణుడుగను, ఒక్కొక్కప్పుడు నిర్గుణుడుగనుకాన్పించును. సగుణబ్రహ్మమనగా శక్తితో కూడియున్నబ్రహ్మము. వానినప్పుడు "ఈశ్వరుడు" అందురు.