పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

2వ అధ్యాయము.

62. నాటకశాలయందు ఒకడే వేర్వేరువేషములను తాల్చుచుండుతీరున, ఈవిశ్వములో భగవంతుడు భిన్నభిన్న స్వరూపములను తాల్చును. మఱియు ఒకేవేషమును అనేకులు వేయువడువున అనేకజంతువులు నరాకృతిని గూడధరింపవచ్చును. అవన్నియు నరులరూపమున కాన్పించుచున్నను, కొన్ని చీల్చిచెండాడు తోడేళ్లు; కొన్ని భయంకరములగు భల్లూకములు; మఱికొన్ని జిత్తులమారి నక్కలు; ఇంకను కొన్నివిషసర్పములు అయివుంటున్నవి.

63. అలజగజ్జననిని మనమందఱము చూడలేకుండుటేల? ఆమె తెఱచాటునుండి వ్యవహారమునంతనునడుపు గొప్పయింటి యిల్లాలువంటిది. అందఱిని తానుచూచుచుండును, గాని ఎవరును ఆమెనుచూడవీలులేదు. భక్తులగు ఆమె కొమరులుమాత్రము "మాయ" యను ఆ తెఱనుదాటిపోయి ఆమెదర్శనముచేయవచ్చును.

64. పోలీసువాడు తనదొంగలాంతరువెలుతురు ఎవరిమీద పడనిచ్చిన వారినెల్లచూడగలడు; కాని అతడావెలుగును తనపైకిత్రిప్పుకొన నంతవఱకును వానినిఎవరునుచూడజాలరు. అటులనే భగవంతుడందఱిని చూచుచునేయుండును, కాని తనంతటతాను ప్రత్యక్షమగునంతవరకును ఎవరును భగవంతుని చూడజాలరు.

65. ప్రతివస్తువును నారాయణుడేయని భగవానుడు సెలవిచ్చెడివాడు, నరుడు నారాయణుడే, పశువునారాయణుడే, ఋషినారాయణుడే, పాతకియునారాయణుడే, ఇంతేల