పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

272

774. జ్వరాతిశయముచేత విదాహముగలిగి పీడితుడగు రోగి సముద్రములోని నీరంతటిని త్రాగివేయ గలననితలచును. ఆజ్వరముతగ్గి ఎప్పటిస్థితికివచ్చినప్పుడు గిన్నెడు నీటినైనను త్రాగడు; పురిసెడు నీటితో సంపూర్ణముగాతృప్తిపడును. అటులనే "మాయా" జ్వరపీడితుడై, తన కించిజ్ఞత్వమును మఱచిన నరుడు అనంతుడగు భగవంతుని విభూతులనన్నిటిని తనచిన్ని హృదయమున యిముడ్చుకొనగలనని తలచును. వాని యీభ్రాంతి తొలగినప్పుడు దివ్యజ్ఞానకిరణమొక్కటియే చాలును వానిని పరమానందభరితుని చేయుటకు!

775. ఒకానొక పెద్దమనుష్యుడు "నాకొమారుడు హరీశుడు పెద్దవాడుకాగానే వానికి పెండ్లిచేసెదను; కుటుంబ వ్యవహారములన్నియు వానికి విడిచివేసి సన్యసించి నేను యోగాభ్యాసము మొదలిడెదను" అని చెప్పెను. ఈపలుకులువిని శ్రీపరమహంసులవారు వానితో "భగవద్భక్తి"ని సాధన చేయుటకు నీకెన్నడును అవకాశము దొఱకదు సుమీ. ఆపిమ్మటనుగూడ "ఈహరీశునకును ఆగిరీశునకును నాపై ప్రేమానురాగముమెండు. నేను సన్యసించితినా, వారు బెంగ గొందురు. హరీశునకొకకొడుకు పుట్టనీలే. మనమని పెండ్లికూడ చూడవద్దూ!" అనబోదువు! ఈవిధముగా నీగొంతెమ్మకోరికలకు హద్దుండబోదు" అనిరి.

776. సన్నని ధాన్యపుగింజలను పోవిడిచి ముతకగింజలను నిలుపుకొనుట జల్లెడకు స్వభావము. అట్లే దుష్టాత్ములు సద్విషయములను జారిపోవిడిచి, దుర్విషయములను నిలిపి