పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

271

40వ అధ్యాయము.

ననుసరించిపోయి "కారణము"ను తెలిసికొందుము. పిమ్మట విలోమవాదము ప్రారంభమగును. ముందు బ్రహ్మమును పొంది, విశ్వమునందలి ప్రతికార్యమునందును ప్రతిఅంశమునందును వాని ప్రభావము వ్యక్తమగుటను తెలిసికొందుము.

ఒకటి పృధక్కరణపద్ధతి; రెండవది సమ్యక్కరణపద్ధతి. మొదటిది అరటిదొప్పలను వలుచుచుపోయి నడుమనున్న ఊచను కనుగొనుటవంటిది. రెండవది ఒకపొఱమీద ఒకపొఱగా దొప్పలను పేర్చుచు పోవుటవంటిది.

772. ప్రశ్న:- సాత్త్విక, రాజసిక, తామసికపూజలనగా ఎట్టివి? భేదమేమి?

ఉ:- సంపూర్ణహృదయముతో, నిరాడంబరముగా, ఆర్భాటమేమియులేక, పూజలర్పించునతడు సాత్త్వికభక్తుడు. పూజామందిరమును అలంకరించుటలో మిగుల శ్రద్ధపూని, నృత్యగీతాదుల ఆర్భాటమును సమకూర్చి, హెచ్చుధనమునువెచ్చించి సమారాధనలుచేసి, పూజార్చనలను జరుపువాడు రాజసికభక్తుడు; నోరులేని గొఱ్ఱెలను మేకలను వందలకొలదిగా బలిపీఠములమీద నఱికి ప్రోగువేసి, మాంసము మద్యములతో సహా కుంభముపోసి, చిందులువేయుచు పదాలుపాడుచు పూజలుచేయువాడు తామసికభక్తుడు;

773. ప్రశ్న:- సంసార మెటువంటిది?

ఉ:- చర్మము టెంకమాత్రము గల ఎండిన పుల్లమామిడికాయవంటిది. గుజ్జుండదు. దానినేగీకుకొని తినినచో కడుపులోశూలపుట్టును.