పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

273

40వ అధ్యాయము.

యుంచుకొనుచుందురు. చేటయొక్కయు, మహాత్ములయొక్కయు స్వభావము దీనికివ్యతిరేకముగ నుండును. (తాలు, తప్ప, చెత్తత్రోసివేసి ఉపయోగకరమగు గట్టిగింజలను నిలుపు కొనును.)

777. దుఃఖాశ్రువులును, ఆనంద బాష్పములును ఒకేకంటినుండి వచ్చును; కాని వేర్వేఱు కొనలునుండి ప్రవహించును. దుఃఖముచేవచ్చు కన్నీరు ముక్కుదాపుకొనలనుండియు, ఆనందముచే గలుగు కన్నీరు వెలుపలి కొనలనుండియు వచ్చును.

778. "మిత్రులారా! నేనెంతకాలము బ్రతుకుదునో అంతకాలము ఏదియో నేర్చుకొనుచునే యుండగలను."

779. భగవంతుడుఇచ్ఛించుచో సూదిబెజ్జములో సామజమును (ఏనుగును) దూర్చగలడు. ఇచ్ఛానుసారము ఆయన యేమైనను చేయగలడు!

780. భరతుడు, ప్రహ్లాదుడు, శుకదేవుడు, విభీషణుడు, పరశురాముడు, బలి, బృందావనగోపికలును భగవంతుని సేవించునిమిత్తము తమ పెద్దలయెడ అవిధేయులై వర్తించిరి.

781. ప్రశ్న:- మతధర్మములు క్షీణించుటకు కారణమేమి?

ఉ:- వాననీరు నిర్మలమైనదేకాని అది భూమిపై పడునప్పటికి సంపర్క దోషముచేత మలినముగ నుండును. మిద్దెలు తూములు, కాలువలు, అన్నియు మురికిగా నున్నప్పుడు వాని గుండ ప్రవహించు వర్ష జలమును ముఱికిగానె యుండునుగదా!