పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

256

ఏమిటండీ? అదెట్లు ? దానిరంగుఎఱ్ఱనకాదే; నీలముగా నుండును!" అనెను. అందుకును ఆమనుష్యుడు నెమ్మదిగా "అవునండీ!" అనెను. ఆమనుజునకు ఊసరవెల్లి తఱచుగా రంగులు మార్చుకొనుచుండునని తెలియును. కావున వాదులాడు ఇరువురి భిన్నవాదనలకును "ఔను" అని అతడు చెప్పగలిగెను. అటులే సచ్చిదానందము వేర్వేఱుస్వరూపములతో నొప్పునది. భగవంతుని ఒక్కకళ మాత్రమే చూచిన భక్తుడు ఆరూపమునుమాత్రమే ఎఱుంగును కాని భగవంతుని వివిధకళలను చూచిన భక్తుడు "ఈ రూపములన్నియు ఆ భగవంతునివే. ఆయన స్వరూపము లనంతములు" అనగలడు. భగవంతుడు నిరాకారుడు; సాకారుడుకూడను. ఆయన అనంతరూపములను ఎవడును ఎఱుంగజాలడు.

722. ప్రతిమానవుడును తనమతమునే అవలంబించవలయును. క్రైస్తవుడు క్రీస్తుమతమును మహమ్మదీయుడు మహమ్మదుమతమును అవలంబించవలసినదే. హిందువునకో ప్రాచీన ఆర్యఋషుల మార్గము నవలంబించుట శ్రేష్ఠము.

723. నిజముగా ధర్మిష్ఠియగు పురుషుడు ఇతరమతములన్నియు సత్యమునుజూపుమార్గాంతరము లేయని తలచవలెను. మనము ఎల్లప్పుడును అన్యమతములయెడ గౌరవము జూపుచు వర్తించవలెను.

724. ఏమతమునందుగాని, ఏసాంప్రదాయమునగాని అసహనముండరాదని శ్రీపరమహంసులవారి అభిప్రాయము. ప్రతిస్త్రీయు ప్రతిపురుషుడును తనమతమునెడల గాఢభక్తియు