పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

257

38వ అధ్యాయము.

శ్రద్ధయు కలిగియుండవలయుననియు అసహనము కూడదనియు చెప్పుచుండెడివారు.

725. ('దళములు' అనగా వర్గములు అనియు నీటిపైని మొలచు 'నాచు' అనియు వంగభాషలలో శ్లేషార్థములు కలవు.)

ప్రశ్న:- దళములను ఏర్పాటుచేయుట మంచిదా?

ఉ:- దళములు పాఱుదలనీళ్లలో పెరుగవు. అవికదల మెదలని మఱుగునీటిలో పెరుగును. ఎవనిహృదయము సదా దైవమువైపునకు ప్రవహించుచుండునో వానికి ఇతరవ్యాప్తులకు అవకాశముకాన్పించదు. పేరుప్రఖ్యాతులకై దేవురించు నతడు దళముల సృష్టించుచుండును.

726. నక్కకూతలు సర్వత్ర ఒక్కటిగనే యుండును; జ్ఞానులబోధలును సర్వత్ర ఏకరీతిగనే యుండును.

727. వాదులాడతగదు. నీయభిప్రాయములను నీవిశ్వాసములను నీవు స్థిరముగ నిలుపుకొనుతీరున ఇతరులును తమ అభిప్రాయములను విశ్వాసములను స్థిరముగ నిలుపుకొనుటకు నీవు స్వాతంత్ర్యమునంగీకరించవలయును. కేవలమువాదులాటచేత నీవొకని పొఱబాటును సవరించుకొనునటుల చేయజాలవు. ఈశ్వరానుగ్రహము కలిగిననాడు ప్రతిమానవుడును తన తప్పులను తానె తెలిసికొనగలడు.

728. విద్యుద్దీపములయొక్క వెలుతురు ఆయాస్థలములందు వేఱువేఱుగా ప్రకాశించును. అయినను ఆవెలుతురు