పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

255

38వ అధ్యాయము.

ఉ:- భగవంతుడు ఒక్కడే. కాని వానికళలు అనేకము! ఒక గృహయజమాని ఒకనికి తండ్రి; ఒకనికి తమ్ముడు, ఒకనికి అన్న, ఒకామెకు మామ, మఱొకామెకు భర్త కావచ్చునుగదా! అటులనే వానివాని భావనావిశేషము ననుసరించి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క తీరున భగవంతుని అభివర్ణించును.

720. ఒకడు మేడమీదికి నిచ్చెనతోడనో, వెదురుసాయముననో, మెట్లమీదుగనో, త్రాడుతో నెగబ్రాకియో పొవచ్చును. అటులనే భగవంతుని చేరుటకు మార్గములు సాధనలు చాలగానున్నవి. ప్రపంచములోని ప్రతిమతమును అట్టి మార్గములలో నొకదానిని చూపును.

721. ఇద్దఱుమనుజులు ఊసరవెల్లిరంగునుగురించి తీవ్రముగ వాదులాడుచుండిరి. "ఆత్రాటి చెట్టుమీద నేనొక ఊసరవెల్లిని చూచినాను; అది చక్కగ ఎఱ్ఱనిరంగుతో నున్నది" అని ఒకడనెను. వానిపలుకులు ఖండించుచు నీమాటతప్పు. నేనును దానిని చూచినాను. అది యెఱ్ఱగా నుండదు. అది నీలముగా నుండును" అనెను. వాదనచేత తమ తగవును త్రెంపుకొనలేక యిరువురును వేఱొక మనుష్యునికడకు పోయిరి. ఈతడు సదా ఆచెట్టుకడనే నివసించువాడు; ఆఊసరవెల్లి రంగుల మార్పులన్నియు చూచినవాడు. వీనికడకువచ్చి వాదులాడువారిలో ఒకడు "అయ్యా ఆచెట్టుమీది ఊసరవెల్లి ఎఱ్ఱగానుండును కాదండీ?" అనెను. అందుకామనుష్యుడు "ఔనయ్యా!" అనెను. రెండవవాడు