పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

249

36వ అధ్యాయము.

"తుపాను ఆగిపోవుగాక!" అనగనే వానిమాటప్రకారము జరిగినది. సరిగా ఆసమయమున అతివేగముతో ఒకఓడ నిండు తెఱచాపలతో సముద్రముమీద పోవుచున్నదట! ఆకస్మికముగ తుపానుఆగగనే, ఆఓడమునిగినదై, అందున్నవారందఱును సముద్రముపాలైరి! అంతమందికి ప్రాణహానిగల్పించిన పాపము ఆసిద్ధునికి తగిలినది. అదికారణముగా వాని కామహిమయు పోయినది; మీదుమిక్కిలి నరకప్రాప్తియు ఘటిల్లినది!!