పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

248

702. సిద్ధులను అశుద్ధముబోలి త్యజించవలయును. యోగసాధనలవలనను, ఇంద్రియ సంయమనమువలనను ఇటువంటి సిద్ధులు లభించుచుండును. కాని ఎవరు వీనిపైని, మనస్సు నిలుపుదురో వారక్కడచిక్కుబడి పోదురు. ఇంక పైకి పోజాలరు.

703. చంద్రము అనువానికి అదృశ్యఘటికాసిద్ధి లభించినది. దాని సాహాయమున, ఇతరులు తననుచూడకుండ, ఇచ్ఛానుసారము అతడెచ్చోటికైనపోగలడు. ఆమహిమఅలవడినపిమ్మట క్షుద్రభోగములకై దానినివినియోగించసాగినాడు. నేనుఅతనిని మందలించినను, అతడు సరకుచేయడయ్యెను. అతడు ఇతరులకు కానరాకుండ ఒక పెద్దమనుష్యుని భవనమునప్రవేశించి, అందొకయువతితో వ్యభిచరించసాగినాడు. కడకతడు తన సిద్ధినికోల్పోయినాడు. ఎందుకునుకొఱగాని పతితుడై పోయినాడు.

704. శ్రీకృష్ణుడు అర్జునునితో నిట్లనెను. "నీవునన్నుపొందవలయుననినచో, నీకడ అష్టసిద్ధులలో నేదేని యున్నంతవఱకు కృతార్థుడవు కాజాలవు."

మహిమలవలన "అహం"కారము బలపడి బ్రహ్మము మఱుగుపడును.

705. ఒక్కొకప్పుడు సిద్ధులవలన గొప్పఅనర్ధములు వాటిలును. ఒకగొప్పసిద్ధునిగురించి "తోటపూరి" అనువారు నాతోడచెప్పిరి. ఆయన సముద్రతీరమున కూర్చుండియుండగా గొప్పతుపానురేగెనట. ఆగోలకు విసుగుచెంది, ఆసిద్ధుడు