పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

16

51. బ్రహ్మముయొక్క స్వభావము ఎట్టిది? - బ్రహ్మముగుణరహితుఁడు. చలనరహితుఁడు, తానుకదలడు, కదల్పబడడు మేరుపర్వతమునుబోలి స్థిరముగనుండును.

52. సూర్యబింబము భూమికన్న అనేకరెట్లుపెద్దది. కాని అతి దూరమున వుండుటచేత చిన్నసిబ్బెయంతగా గోచరించును. అటులనే భగవంతుడు గణనాతీతుడైపరగును. కానివానినుండి బహుదూరముననున్నమనము వానినిజమ హిమను గ్రహింపజాలకున్నాము.

53. రెల్లుతోడను, నాచుతోడను, కప్పబడియున్నగుంటలో ఆటలాడుచేపలు మనకుకానరానట్లు మాయచేతకప్పబడి యున్నమానవహృదయమునవర్తించుభగవంతుడు మనకు గోచరింపకున్నాడు.

54. భగవంతుడు నిరాకారుడు; కాని వానికిఆకారమునుకలదు. మఱియుభగవంతుడు సాకారనిరాకారరూపములరెండింటికిని అతీతుడునుఅగును. వానిపూర్ణరూపము వానికేయెఱుక.

55. భగవంతుడు నిరామయుడు. అఖండబ్రహ్మమును జగజ్జనకుడునుకూడ అతడే. నిర్మలసచ్చిదానందమూర్తి యగు అఖండబ్రహ్మము, పారమును, తీరమునులేని మహాసముద్రములీల దుర్గ్రాహ్యమైయొప్పును. మనముఅందులోపడి కొట్టుకొని మునిగిపోవలసినదే, గాని మనముభగవంతుని సాకారలీలారూపభావమున జొచ్చునెడల, సముద్రమున మునుగుతరిని తీరమునకుకొట్టుకొనివచ్చు మనుజునివడువున, సులభముగా శాంతినిపడయగలుదుము.