పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

2వ అధ్యాయము.

56. మంచుగడ్డఘనీభూతమైననీరే. అటులభగవంతుని సాకార దృశ్యరూపము భౌతికాకృతినిదాల్చిన అనంతనిరాకార బ్రహ్మమే, అదిఘనీభవించిన సచ్చిదానందరసమే అనవచ్చును. మంచుగడ్డనీటిలోని అంతర్భాగమై, నీటిలోనే నిలిచి, తుదకానీటిలోనె కరిగిపోవును. అటులనే సాకారదై వతమునిర్గుణబ్రహ్మమునందొక అంశమే. ఆనిర్గుణ బ్రహ్మమునందే పుట్టును. అందేవర్తించును; తుదకందేలయమై అంతర్థానమగును.

57. బ్రహ్మసాగరమునుండి వీచువాయువు ఏహృదయముపై వీచునో అదెల్ల పరివర్తనమును పొందును. సనక సనాతన ప్రముఖమునివరులు ఆవాయువుసోకి ముగ్ధులైరి; భగవద్భక్తి పరవశుడగుటకు నారదుడాదివ్యసముద్రపు జాడనుదూరమునుండి చూచియుండవలెను. అటుల పరవశుడగుటచేత తననుదామఱచి, నిరంతరము శ్రీహరి గీతముల పాడుచు ఉన్మాదుడై జగమెల్లక్రుమ్మరుచున్నాడు. పుట్టువుతోడనే మునిప్రకాండుడైపఱిగిన శుకదేవుడు ఆజలధిని తనహస్తముతో ముమ్మారుమాత్రమేతాకినాడు. అంతటినుండియే పసిపాపవలె ఆనందమగ్నుడై దొరలాడు చున్నాడు. జగద్గురు ప్రకాండుడగు మహాదేవుడు మూడు చేరలు జలముంద్రావినంతనే పరమానందమున చ్రొక్కి స్థాణువై కదలమెదలలేకున్నాడు. ఇక ఈమహాసాగరము యొక్కలోతు కొలుచుటకుగాని, దానిమహిమను గణితము వేయుటకుగాని ఎవరికి సాధ్యపడగలదు ?